పాన్ ఇండియా లెవల్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ సినిమాపై రోజుకో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు అని ఒక సమాచారం. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో రూపొందుతోంది. టైమ్ ట్రావెల్, వారియర్ కాన్సెప్ట్‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా లేదంటే ఇతర పవర్‌ఫుల్ రోల్‌లోనో కనిపించనున్నారు. గతంలో అట్లీ దర్శకత్వం వహించిన షారుక్‌ఖాన్ సినిమా జవాన్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అట్లీ – విజయ్ సేతుపతి మధ్య ఉన్న స్నేహం వల్లే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్ కూడా జరిగింది. ఇందులో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ, ప్రధాన తారాగణం పాల్గొన్నారు.

- August 22, 2025
0
170
Less than a minute
You can share this post!
editor