హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న పవర్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని వారు అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా తొలిపాటను విడుదల చేశారు. ‘మారెనా..’ అంటూ సాగిన ఈ ప్రేమగీతాన్ని భాష్యశ్రీ రాయగా, విజయ్ ఆంటోనీ స్వరపరిచారు.
అభిజిత్ అనిల్‌కుమార్ ఆలపించారు. యువతకు నచ్చేలా ఈ పాట చిత్రీకరణ సాగింది. విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ సినిమాని తెలుగులో విడుదల చేసిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తోంది. వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: షెల్లీ కాలిస్ట్.
