‘కూలీ’ ఫస్ట్ సింగిల్‌పై లేటెస్ట్ బజ్!

‘కూలీ’ ఫస్ట్ సింగిల్‌పై లేటెస్ట్ బజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున సాలిడ్ రోల్‌లో ఉపేంద్ర ఇంకా తదితర  స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమాయే “కూలీ”. తమిళ్ సహా తెలుగులో కూడా భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుండి ఇక వరుస అప్‌డేట్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ముందు సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన మొదటి సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్‌పై ఫైనల్‌గా లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. కోలీవుడ్ వర్గాల్లో అయితే ఈ పాట ఈ వారంలోనే విడుదల అవుతుంది అని టాక్. ఇక దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది అని వీకెండ్‌కి అలా సాంగ్ రిలీజ్ ఉండొచ్చని వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఈ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌కి సిద్ధమౌతోంది.

editor

Related Articles