బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. పూలతో అలంకరించిన బతుకమ్మను ఆమె భక్తిశ్రద్ధలతో ఎత్తుకుని, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఖుష్బూ మాత్రమే కాకుండా, కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, పలువురు మహిళా నేతలు హాజరయ్యారు. చార్మినార్ చుట్టూ బతుకమ్మ ఆట పాటలతో సందడి వాతావరణం ఏర్పడింది. ఖుష్భూ సహా మహిళా నేతలందరూ సంప్రదాయ నృత్యంతో బతుకమ్మ ఆడుతూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖుష్బూ.. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను, సినిమాల్లో డ్యాన్స్ చేయాలంటే కొరియోగ్రాఫర్ చెబుతాడు. కానీ ఇక్కడ మహిళలు తాము గానం చేస్తూ ఆడిపాడుతున్నారు. ఇది నిజంగా గొప్ప అనుభూతి అని చెప్పారు. తనను కూడా ప్రేమతో ఆహ్వానించినందుకు తెలంగాణ మహిళలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

- September 24, 2025
0
50
Less than a minute
You can share this post!
editor