బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. భారీ అంచనాలతో విడుదలైన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడంతో, కియారాకు భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో అనేక అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన వార్ 2 సినిమా ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదలై మొదటి వీకెండ్ వరకూ చక్కటి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కావడంతో భారీ నష్టాలు మిగిలాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా డిజాస్టర్ కావడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వార్ 2 విఫలమైన తర్వాత YRF స్పై యూనివర్స్ ప్రాజెక్టులపై మళ్లీ వ్యూహాలు పునః సమీక్షించబడుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కియారా అద్వానీతో వైఆర్ఎఫ్ మూడు సినిమాల డీల్ చేసినట్లు సమాచారం. స్పై యూనివర్స్‌లో ప్రధాన మహిళా పాత్రల కోసం ఆమెను ఎంపిక చేసినప్పటికీ, తాజా ఫలితంతో ఆ కాంట్రాక్ట్ రద్దు అయ్యేలా ఉంది. వార్ 2 సినిమాలో కియారా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కెరీర్‌లో తొలిసారి బికినీ లుక్‌లో కనిపించారు. కానీ కథా బలం లేకపోవడంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సినిమా విఫలమైంది. ఫలితంగా కియారాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల తల్లి అయిన కియారా, ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్ తీసుకున్నారు. ఈ కారణంగా కూడా ఆమె కొత్త సినిమాలకు కొంత విరామం ఇచ్చారు.
