రజినీకాంత్‌తో ‘ఖాకీ’ దర్శకుడు?

రజినీకాంత్‌తో ‘ఖాకీ’ దర్శకుడు?

ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న సినిమాలలో ఒకటి ఆల్రెడీ రిలీజ్‌కి సిద్ధం అయ్యింది. ఇక మరో సినిమా షూటింగ్‌ని జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలు కాకుండా నెక్స్ట్ సినిమాలుగా రజినీకాంత్ నుండి ఎవరితో ఉంటాయి అనేది ఇంకా ఎలాంటి డిటైల్స్ బయటకి రాలేదు. ఇక తన లైనప్‌పై ఓ సాలిడ్ బజ్ ఇపుడు బయటికి వచ్చింది. దీంతో యువ దర్శకుడు హెచ్ వినోద్‌తో తలైవర్ వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినోద్ దళపతి విజయ్‌తో జన నాయగన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రజినీని రెండుసార్లు కలిశాడట. మరి ఈ కలయికలోనే సినిమా ఓకే చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. వినోద్ నుండి ఖాకీ, వలిమై, తునివు లాంటి సాలిడ్ హిట్స్ ఉన్నాయి. అలాగే ఖాకీ 2 కూడా కార్తీతో ఉందని టాక్ నడుస్తోంది. సో ఇలాంటి దర్శకునితో రజిని కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

editor

Related Articles