మ‌మ్ముట్టి ఆరోగ్యంపై స్పందించిన కేర‌ళ ఎంపీ

మ‌మ్ముట్టి ఆరోగ్యంపై స్పందించిన కేర‌ళ ఎంపీ

మ‌ల‌యాళీ మెగాస్టార్ మ‌మ్ముట్టి గ‌త కొన్నిరోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై అత‌డి స్నేహితుడు, కైరాలి టీవీ అధినేత, రాజ్య‌స‌భ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్ స్పందించారు. మమ్ముట్టి ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వస్తోన్న వార్తలను జాన్ ఖండించారు. మమ్ముట్టికి ఆరోగ్యం బాలేద‌న్న‌ది నిజ‌మే కానీ అంత సీరియస్ కాద‌ని వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు. మమ్ముట్టి నేను మంచి స్నేహితులం. ఇంత‌కుముందు మా ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి చ‌ర్చించేవాళ్లం కాదు. కానీ కొన్ని రోజుల నుండి వాటి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడు. ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నాడు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారు అంటూ జాన్ చెప్పుకొచ్చాడు.

editor

Related Articles