నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలోనే గోవాలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇక తను హిందీలో అరంగేట్రం చేస్తున్న ‘బేబి జాన్’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నందున స్వామి వారి దర్శించుకున్నానని తెలిపారు.
కీర్తి సురేశ్ ఇటీవల తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పోస్ట్ చేసి మన అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు ఆంటోనితో ప్రేమలో ఉన్నట్లు, వారి 15ఏళ్ల బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు. “తేరీ” సినిమాకు రీమేక్ అయిన ‘బేబీ జాన్’ చిత్రం హిట్ అయ్యి, కీర్తి పెళ్లికి మంచి కిక్ ఇవ్వాలని ఆశిద్దాం.