పెళ్లి త‌ర్వాత జాక్ పాట్ కొట్టిన కీర్తి సురేష్‌..?

పెళ్లి త‌ర్వాత జాక్ పాట్ కొట్టిన కీర్తి సురేష్‌..?

అప్పట్లో కీర్తి సురేష్‌ని వ‌రుస హిట్స్ ప‌ల‌క‌రించిన ఇప్పుడు మాత్రం హిట్ పడడం క‌ష్టంగా మారింది. టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్, బాలీవుడ్‌లో మాత్రం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. మొద‌ట్లో ప‌ద్ధతిగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవ‌ల గ్లామ‌ర్ డోస్ కూడా పెంచింది. పెళ్లయిన తర్వాత ఈ హీరోయిన్ గ్లామర్ షోలకు దూరంగా ఉంటుందని అంతా అనుకున్నారు దీనికి భిన్నంగా ముందుకంటే మరింతగా గ్లామర్ డోస్ పెంచేసి రెచ్చిపోతోంది. గత సంవత్సరం అట్లీ నిర్మాణంలో విడుదలైన బేబీ జాన్ సినిమా ద్వారా హిందీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్‌. ఆ సినిమాతో కీర్తి బాలీవుడ్‌లో స‌త్తా చాటాలని అనుకుంది. కాని సినిమా ప‌రాజ‌యం చెంద‌డంతో తిరిగి దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్‌గా కీర్తి సురేష్‌ మరో జాక్‌పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. సార్, లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొంద‌నున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారట. సూర్యా 46వ సినిమాగా ఈ సినిమా రూపొందుతుండ‌గా, ప్రస్తుతం ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ సూర్యతో కలిసి నటిస్తోంది. మ‌రి ఈ సినిమాతో అయినా హీరోయిన్ ఫేట్ మారుతుందో లేదో వేచి చూడాలి.

editor

Related Articles