డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)కి ఈ సినిమాయే మూలం. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని తమిళ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ నానుస్తూ వస్తున్నారు. ఏదైతేనేం ఇన్నాళ్లకు కాస్త కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.
మానగరం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనగరాజ్.. కార్తీతో ఖైదీ తీసినప్పుడు ఎలాంటి అంచనాల్లేవు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఓ యూనివర్స్ సృష్టించి.. లియో, విక్రమ్ సినిమాలకు కనెక్షన్ ఇచ్చాడు. ఇందులో ఖైదీ 2, రోలెక్స్ మూవీస్ రావల్సి ఉంది. కానీ లోకేష్.. రజినీకాంత్‌తో కూలీ తీశాడు. మరోవైపు అమీర్‌ఖాన్‌తోనూ త్వరలో ఓ మూవీ తీస్తాడనే రూమర్స్ వచ్చాయి. దీంతో ఖైదీ సీక్వెల్ ఇప్పట్లో రాదేమోనని అంతా అనుకున్నారు. కానీ ఖైదీ సినిమాకి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. అయితే ఈ రోజు (అక్టోబర్ 25) నుండి సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైపోయాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే గనక మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించవచ్చు.

