బలగం’ సినిమాతో మంచి పేరుతెచ్చుకున్నాడు నటుడు, దర్శకుడు వేణు యెల్దండి. తన నెక్ట్స్ సినిమాగా ఆయన ‘ఎల్లమ్మ’ని ప్రకటించడంతో షూటింగ్ ప్రారంభించకముందే సినిమా చర్చనీయాంశమైంది. ఇందులో హీరోగా నితిన్ నటించనున్నట్టు ఏనాడో ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం లెక్కలు మారినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లకు తేలడంతో మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా స్టార్‌తో వెళ్లాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. ఇందులో భాగంగా తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ ఉన్న హీరో కార్తీని సంప్రదించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో హీరోయిన్ ‘ఎల్లమ్మ’ పాత్రకు సాయిపల్లవి, కీర్తిసురేష్ ఇద్దరిలో ఒకర్ని ఖరారు చేసే అవకాశం ఉంది, కానీ 90 శాతం మాత్రం కీర్తిసురేష్‌నే ఆ పాత్ర వరించనున్నది. ఈ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన త్వరలో ప్రకటిస్తారు.
- August 29, 2025
0
235
Less than a minute
You can share this post!
editor


