భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆ సినిమా..?

భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన  ఆ సినిమా..?

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘కాంత’. కాగా ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో మార్నింగ్ షోతో ఆట బిగినైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సినిమా చూసి తెలుసుకుందాం! కథ : అయ్య (సముద్రఖని) ఓ సినిమా డైరెక్టర్. అనాథ అయిన మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని తీసుకొచ్చి హీరోని చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహదేవన్ పెద్ద సినిమా హీరో అవుతాడు. దీంతో, తనకు తాను గొప్ప హీరోను అయ్యాను అనే పొగరు, అహంకారం పెరిగిపోతుంది. దీనికి తోడు కథ కంటే కూడా.. అభిమానులు కొట్టే చప్పట్లపైనే తన దృష్టిని పెట్టేవాడు. ఈ నేపథ్యంలో అయ్య (సముద్రఖని) ఇష్టపడి రాసుకున్న శాంత కథతో సినిమా షూటింగ్ మొదలౌతుంది. ఇద్దరి మధ్య కొన్ని ఇగోలు కారణంగా ఆ సినిమా అనుకోకుండా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ కొన్నేళ్లకు శాంత సినిమా, కాంత సినిమాగా మళ్ళీ మొదలౌతుంది. ఈసారి కొత్త అమ్మాయి కుమారి (భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్‌గా నటించింది.

editor

Related Articles