‘కన్నప్ప’ ప్రీ-రిలీజ్  డిటైల్స్..

‘కన్నప్ప’ ప్రీ-రిలీజ్  డిటైల్స్..

టాలీవుడ్ డైనమిక్ మంచు విష్ణు హీరోగా దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన భారీ సినిమా “కన్నప్ప” గురించి అందరికీ తెలిసిందే. యదార్ధ ఘటనల ఆధారంగా గ్రాండ్ స్కేల్‌లో అందులోని పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా  రిలీజ్‌ తేదీ దగ్గర పడుతోంది. ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ రాగా ఫైనల్‌గా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై లేటెస్ట్ క్లారిటీ బయటకి వచ్చింది. దీంతో ఈ జూన్ 21న గ్రాండ్‌గా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో మేకర్స్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ ఈవెంట్‌లో దాదాపు సినీతారలు మొత్తం కనిపిస్తారట. అంటే మోహన్‌లాల్, కాజల్, అక్షయ్‌కుమార్, శరత్‌కుమార్‌లు హాజరవుతారని తెలుస్తోంది. ఇక వీరితో పాటుగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా అటెండ్ అయ్యేందుకు అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టు వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమా రిలీజ్‌ని ఈ జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఘనంగా విడుదల చేయబోతున్నారు.

editor

Related Articles