పెళ్ళి అయిన మగాళ్లనే తాను ఎప్పుడూ టార్గెట్ చేస్తానని వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించింది బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయపడే మహిళల మీదనే ఇలాంటి కామెంట్లు వస్తుంటాయని తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా తన పర్సనల్ లైఫ్‌తో పాటు ఇప్పుడున్న డేటింగ్ పోకడల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. అమ్మాయిలు వయసులో ఉండి ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు ఒక పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న మగాడు మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది మగవాడి తప్పు కాదు. మీరు పెళ్ళి అయిన వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం మీ తప్పు అని జనాలు ఎప్పుడూ మహిళను తప్పుగా చూస్తారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి తప్పు చేసినట్లే, మగవాడి తప్పు చేశాడు అని ఎవరూ అనుకోరంటూ కంగనా అభిప్రాయపడింది. దీనినే పురుషాధిక్య సమాజం అని కూడా అంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి ద్వారా అయినా లేదా చదువుకున్న టైంలో అయినా అమ్మాయిలు తమ పార్ట్‌నర్‌లను వెతుక్కోవాలని కంగనా సూచించింది. అలాగే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు అమ్మాయిలకు అంత మంచివి కాదని కంగనా చెప్పుకొచ్చింది. ఇలాంటి రిలేషన్‌లో అమ్మాయిలకు గర్భం వస్తే కుటుంబంలోని వారు ఎవరూ కూడా మద్దతు తెలపరని కూడా చెప్పింది.

- August 16, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor