శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైనీ జంటగా నటించిన సినిమా కన్యాకుమారి. సృజన్ అట్టాడ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో ఈ నెల 17 (బుధవారం) నుండి స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ నేపథ్యంలో (శ్రీకాకుళం) సాగే ప్రేమకథతో ఈ సినిమా తీశారు. నిర్మాత బన్నీ వాసు డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలోకి వచ్చింది. రైతు పాత్రలో తిరుపతిగా శ్రీచరణ్, ఐటీ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యమున్న కన్యాకుమారిగా గీత్ అలరించారు.

- September 17, 2025
0
24
Less than a minute
You can share this post!
editor