కాంతారా 1 తర్వాత రుక్మిణి వసంత్ లైఫ్..

కాంతారా 1 తర్వాత రుక్మిణి వసంత్ లైఫ్..

కన్నడ సినిమా కాంతారా చాప్టర్ 1 తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. ఈ హీరోయిన్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిరుచుల గురించి షాక్ అయ్యే విషయాలు వెల్లడించారు. సినిమాలో కనకావతి పాత్రలో ఆమె చూపించిన పవర్, సౌత్ ఆడియ‌న్స్‌కి తెగ న‌చ్చేసింది. కాంతారా 2 తర్వాత రుక్మిణి మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే తాజాగా రుక్మిణి మాట్లాడుతూ, నటిగా మారడానికి ముందు మోడలింగ్ చేశాన‌ని, అది చూసే నాకు మొదటి సినిమా ఆఫర్ వచ్చింది అని వెల్లడించారు.
సప్త సాగరాలు దాటి డైరెక్టర్‌కి ఆడిషన్ కోసం మెసేజ్‌ పంపించాను. అది చూసి ఆడిషన్‌కు పిలిచారు. ఆ మెసేజ్ చూడకపోయి ఉంటే ఆ అవకాశం వచ్చేది కాదని నాకు తెలుసు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి అని ఆమె తెలిపారు. అలాగే, సినిమాల్లోకి అడుగు పెట్టాలనే కోరికతో లండన్‌లో థియేటర్ ఆర్ట్స్ చదివినట్లు చెప్పింది.

editor

Related Articles