కాంతార చాప్టర్ 1 సినిమా విడుదలయిన నాటి నుండి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.717 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిలో ఏపీ, తెలంగాణ నుండి రూ.105 కోట్లు రావడం విశేషం. కన్నడ చిత్రాలలో కేజీఎఫ్ చిత్రం రూ.1200 కోట్ల కలెక్షన్లతో మొదటిస్థానంలో ఉండగా.. కాంతార చాప్టర్ 1 ప్రస్తుతానికి రూ.717 కోట్లతో రెండవస్థానంలో నిలిచింది. ఇంకా మరెన్ని రికార్డులు సాధిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజుకే బుక్ మై షోలో పది లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం.

- October 17, 2025
0
49
Less than a minute
You can share this post!
editor