సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌..

సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌..

హీరో కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ సినిమా “థగ్ లైఫ్”. త్రిష హీరోయిన్‌గా, నటుడు శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి థియేటర్లలో మాత్రం ఆశించిన స్పందన రాకపోవడంతో మొదటిరోజు నుండే ప్లాప్ టాక్‌ను ఎదుర్కొంది. దీంతో ఈ సినిమా త్వరగా ఓటీటీలోకి వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు అదే జరిగింది. “థగ్ లైఫ్” సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఓటిటీలో ముందుగానే విడుదల చేసింది. మొదట హిందీ వెర్షన్‌ ఆలస్యంగా రానుందని వార్తలు రాగా, అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ని రిలీజ్‌కి ముందే భారీ ధ‌ర‌కి కొనుగోలు చేసింది నెట్‌ఫ్లిక్స్. సినిమాని థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఎనిమిది వారాల‌కి స్ట్రీమింగ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారు. కాని ఇప్పుడు సినిమాకి నెగెటివ్ టాక్ రావ‌డంతో నాలుగు వారాల‌లోనే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ ఇలా అన్ని భాష‌ల‌లో ఇప్పుడు థ‌గ్ లైఫ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. క‌ర్ణాట‌క‌లో ఈ సినిమా బ్యాన్ కాగా, అక్క‌డి అభిమానులు సినిమాని చూడ‌లేక‌పోయారు. ఓటీటీ ద్వారా వారికి చూసే అవ‌కాశం ఇప్పుడు వచ్చింది. కమల్, మణిరత్నం, రెహమాన్ లాంటి దిగ్గజాలు కలిసి రూపొందించిన సినిమా కావడంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులు ఈ సినిమాని మరింత ఆసక్తితో వీక్షించే అవకాశం ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ఈ సినిమా అందుబాటులోకి తీసుకురావడంతో, థియేటర్‌లో మిస్ అయిన‌వారు నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

editor

Related Articles