మరికొద్ది రోజుల్లో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో కమల్ లేని పోని చిక్కుల్లో పడ్డాడు. మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుండి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు. శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ వేదికపై ఉన్నారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుండి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. అంటే కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించింది అన్నట్టుగా కమల్ కామెంట్స్ ఉండడంతో కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ… కమల్ హాసన్ ‘సంస్కారం లేని వ్యక్తి’ అని, కన్నడ భాషను అవమానించారంటూ మండిపడ్డారు.
- May 28, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor

