డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి చెప్పక్కరలేదు. మంచి డైరెక్టర్, శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి తొలి సినిమా ఎవడే సుబ్యమణ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా అనంతరం కీర్తి సురేష్‌తో మహానటి అంటూ సూపర్ హిట్ అందుకున్నాడు నాగ్. తర్వాత ప్రభాస్‌తో కల్కి సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టాడు. కల్కి 2 పనులు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వేరే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు నాగ్ అశ్విన్. నాగ్ ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫిమేల్ లీడ్ రోల్‌లో బాలీవుడ్ నుండి అలియా భట్‌ని నాగ్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలియా భట్ ఫిమేల్ లీడ్ రోల్‌లో చేసిన హైవే, గంగుబాయి కతియావాడి, డియర్ జిందగి, జిగ్రా, రాజీ చిత్రాలు హిట్ అవ్వడంతో అలియాభట్ అయితేనే ఈ పాత్రకు సెట్ అవ్వుతుందని నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు.

- November 11, 2024
0
44
Less than a minute
Tags:
You can share this post!
administrator