దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకి ఎంపికైన ‘క’

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకి ఎంపికైన ‘క’

హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన ‘క’ సినిమాకి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఈ సినిమా నామినేట్‌ అయ్యింది. ఉత్తమ సినిమా విభాగానికి ‘క’ నామినేట్‌ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు. నూతన దర్శకులు సుజిత్‌, సందీప్‌ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ ఇందులో హీరోయిన్లు. ఇదో విభిన్నమైన కథ. కర్మసిద్ధాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సగటు ప్రేక్షకునికి ఆద్యంతం సినిమా చూస్తే తప్ప అంతుచిక్కని స్క్రీన్‌ప్లేతో దర్శకులు సుజిత్‌, సందీప్‌ ‘క’ ను మలిచారు. వాణిజ్యపరంగా 50 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్‌ కూడా ఉంటుందని, తొలి పార్ట్‌ని మించి ఉండేలా ‘క -2’ తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు.

editor

Related Articles