కూతురికి అన్న‌ప్రాస‌న.. ఫుల్ ఖుషీగా కనిపించిన జోర్ధార్ సుజాత‌

కూతురికి అన్న‌ప్రాస‌న.. ఫుల్ ఖుషీగా కనిపించిన జోర్ధార్ సుజాత‌

జబర్దస్త్‌ కపుల్ రాకింగ్‌ రాకేష్, జోర్దార్ సుజాతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. జబర్దస్త్ అలాగే ఎక్‌స్ట్రా  జబర్దస్త్‌లో చాలా స్కిట్లు చేసి తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే రాకేష్ త‌న తోటి ఆర్టిస్ట్‌తో క‌లిసి బుల్లితెరపై కామెడీ చేస్తున్న నేపథ్యంలోనే ఇతనికి జోర్దార్ సుజాతతో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ ఎన్నో స్కిట్లు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఇక రోజురోజుకీ వీరిద్ద‌రి మ‌ధ్య బాండింగ్ బ‌ల‌ప‌డ‌డంతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాకేష్ – జోర్దార్ సుజాతలు పెద్దల అనుమతితో 2023 ఫిబ్రవరి 24న తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు. వారి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది అక్టోబర్‌లో ఖ్యాతిక వీరి ఇంట్లోకి అడుగు పెట్టింది. గతేడాది నవంబర్‌లోనే ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి సన్నిధిలో తమ కూతురి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కూతురు పుట్టిన తర్వాత చాలా సందర్భాలలో బయట కనిపించినప్పటికీ ఎప్పటికప్పుడు కూతురు ఫేస్‌ని దాచి పెడుతూ వచ్చారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా కూతురు ఫేస్ రివీల్ చేశారు రాకేష్ దంపతులు. ఇక రాకేష్ సుజాత దంపతులు కూతురుకి అన్నప్రాసన వేడుకను నిర్వహించ‌గా, ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ‘మా పాప తొలి పండుగ అంటూ ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈ ఫొటోల‌కి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ క్యూట్, పాప చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ పెడున్నారు. కాగా రాకింగ్ రాకేష్ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. మరోవైపు సుజాత మాత్రం పాపను చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటోంది. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ప‌లు షోలలో మెరుస్తోంది. సుజాత కెరీర్ బిగినింగ్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లో పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సుజాత.

editor

Related Articles