క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్!

క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్!

బాలీవుడ్… టాలీవుడ్ ఎక్కడైనా ఇప్పుడు అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ మాటే వినిపిస్తోంది. తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్లాట్ ఫామ్‌ని ఏర్పరచుకుంటోంది. అయితే.. జాన్వీకపూర్‌కు తెలుగులో గ్లామర్ హీరోయిన్ పాత్రలే ఇస్తున్నారని, ఎన్ఠీఆర్ ‘దేవర’, రాబోయే రామ్ చరణ్ ‘పెద్ది’లో సైతం ఇలాంటి పాత్రలే లభించాయని.. ఎక్కువ స్కిన్ షోనే కనిపించిందని, ఇలా అయితే తనలో బెస్ట్ నటిని చూసే అవకాశం ఎలా దక్కుతుందని సినీప్రియులు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడో ముఖ్యమైన లాజిక్ మిస్సవుతున్నారు. ఇప్పటి జనరేషన్ జాన్వీని ప్రత్యేకంగా పెర్ఫార్మన్స్ కోసం చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించేటప్పుడు అలాంటి స్కోప్ అరుదుగా దక్కుతుంది. అందుకే రష్మిక మందన్న ‘గర్ల్ ఫ్రెండ్’ లాంటి స్టోరీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. కానీ జాన్వీకపూర్‌కు సౌత్‌లో అలా సాధ్యం కాదు. ఆ మాటకొస్తే తన నటనను రుజువు చేసుకునే సినిమాలు ఆమె హిందీలో చాలానే చేసింది. గుంజన్ సక్సేనా, మిలి లాంటివి క్రిటిక్స్‌ని మెప్పించాయి..

editor

Related Articles