కృష్ణ కుటుంబం నుండి మరో వారసురాలు రాబోతోంది. ఆమె మరెవరో కాదు కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్. త్వరలోనే సినీ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. నటన, డాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన జాన్వీ ఇప్పటికే కొన్ని కథలను విన్నట్టు సమాచారం. వాటిలో ఒక సినిమా కోసం అధికారిక ఒప్పందం కూడా పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె డెబ్యూ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మంజుల నిర్మాతగా, కొన్నిసార్లు నటిగా, అలాగే దర్శకురాలిగా కూడా ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత దూరంగా ఉన్నారు. ఇప్పుడు అదే ఇంటి నుండి మరో తరం తెరపైకి రావడానికి సిద్ధమవుతుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు కృష్ణ చిన్న కుమారుడు రమేష్ బాబు కొడుకు కూడా అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఘట్టమనేని కుటుంబం నుండి కొత్త తరం ఇండస్ట్రీకి వస్తుండడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- October 29, 2025
0
40
Less than a minute
You can share this post!
editor

