ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తొలిసారి సందడి చేసింది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. గత వారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌కి ప్రపంచంలో ఉన్న ఫేమస్ నటీనటులు అందరూ హాజరై సందడి చేస్తూ ఉంటారు. హాలీవుడ్ నటీమణులు ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరై రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. తొలిసారి జాన్వీకపూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హజరై ప్రపంచాన్నంతా తనవైపుకి తిప్పుకుంది. మంగళవారం జాన్వీకపూర్, ఇషన్ కట్టర్ జంటగా నటించిన ‘హోమ్‌బౌండ్ సినిమా ప్రీమియర్ జరుపుకోగా, దానికోసం జాన్వీ కేన్స్‌లో తొలిసారి అడుగుపెట్టింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ శారీతో జాన్వీ రెడ్ కార్పెట్‌పై నడిచి చూపరుల దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. జాన్వీకపూర్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో కేన్స్‌లో చూస్తే అర్ధమైంది.
- May 21, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor

