అక్కినేని మూడో తరం హీరోలు నాగ చైతన్య, అఖిల్ ఇప్పుడిప్పుడే కెరీర్‌లో గాడిన పడుతున్నారు. నాగ చైతన్య తండేల్ సినిమా పెద్ద హిట్ కాగా, అఖిల్ కూడా తన తదుపరి సినిమాతో భారీ హిట్ కొట్టడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అయితే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య 2024 డిసెంబర్‌లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట సంతోషంగానే ఉంది. ఇక అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా, అందుకు సంబంధించిన ఫొటోలని నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక నిశ్చితార్థం తర్వాత ఈ జంట పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సరదాగా వెకేషన్స్‌కి వెళుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కినేని అఖిల్ వివాహం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 6న ఆయన పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావలసి ఉంది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
- May 27, 2025
0
182
Less than a minute
Tags:
You can share this post!
editor

