‘స్పిరిట్’ కథను లీక్ చేశారంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. వ్యక్తి ఎవరో చెప్పకుండా ఆయన నర్మగర్భంగా పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇటీవల ‘స్పిరిట్’ సినిమా నుండి నటి దీపికా పదుకొణెని తప్పించిన నేపథ్యంలో.. ‘స్పిరిట్’ కథను ఆమే లీక్ చేసి ఉంటుందని, ఆమెను ఉద్దేశించే సందీప్ ఆ పోస్ట్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక.. అక్కడి మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే విలువనిస్తా. క్లిష్టపరిస్థితుల్లో నా మనసు చెప్పేదే వింటా. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటా. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటా. ఈ క్రమంలో నా నిజాయతీని మాత్రం విడిచిపెట్టను’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సందీప్‌రెడ్డి పోస్ట్‌కు కౌంటర్ అయి ఉండచ్చు అని పలువురు భావిస్తున్నారు.
- May 30, 2025
0
85
Less than a minute
Tags:
You can share this post!
editor

