ఐటీ ఉద్యోగి కిడ్నాప్‌ కేసులో లక్ష్మీ మేనన్‌కు ఊరట..

ఐటీ ఉద్యోగి కిడ్నాప్‌ కేసులో లక్ష్మీ మేనన్‌కు ఊరట..

కేర‌ళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో త‌మిళ‌ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో న‌టి లక్ష్మీ మేనన్‌కు ఊరట లభించింది. కేరళ కోర్టు సెప్టెంబర్‌ 17 వరకూ న‌టికి ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అప్పటివరకూ ఆమెను అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు సూచించింది. అసలేం జ‌రిగిందంటే.. గ‌త ఆదివారం కొచ్చిలోని ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్‌ గ్యాంగ్‌కి, ఐటీ ఉద్యోగినికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితులు ఐటీ ఉద్యోగిని వెంబడించి కారును అడ్డగించారు. ఆ తర్వాత అతడిని బలవంతంగా తమ కారులోకి లాక్కొని దాడికి పాల్పడ్డారని స‌మాచారం. అయితే దీనిపై కేసును న‌మోదు చేసిన ఎర్నాకులం నార్త్ పోలీసులు న‌టి స్నేహితులైన మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి లక్ష్మీ మీనన్ ప్ర‌స్తుతం పరారీలో ఉంద‌ని ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్ల‌డించారు. అయితే న‌టి పేరును ఇంకా ఎఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేయలేదు. లక్ష్మీ మీనన్ ప్రధానంగా తమిళ సినిమాలలో ఎక్కువ‌గా న‌టించింది. విశాల్ న‌టించిన ఇంద్రుడు సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది.

editor

Related Articles