సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబోలో తొలిసారి రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులే ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర బృందం. నాగార్జున, ఉపేంద్ర, సౌబిర్ షబీన్, శ్రుతిహాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌తో సందడి చేయనుంది. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న లోకేష్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొడతాడో అని అందరూ ముచ్చటించుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి టైటిల్ చాలా పెద్ద ప్లస్. కూలీ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ కూలీ పేరుతోనే సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. కాని ఒక్క భాషలో మాత్రం ఇప్పుడు సినిమా టైటిల్ మార్చబోతున్నారు. హిందీలో కూలీ అని కాకుండా ‘మజాదూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇదే టైటిల్‌తో విడుదల చేస్తున్నట్టుగా తమిళ సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి ఇప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. హిందీలో కూడా కూలీ అని పెడితేనే బాగుండేది కాని హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన కూలీ అనే క్లాసిక్ హిట్ సినిమా ఉండనే ఉంది. ఇంకా 2020లో వరుణ్ ధావన్ నటించిన కూలీ నెంబర్ 1 అనే సినిమా కూడా విడుదలైంది. ఇలా ఒకే పేరుతో రెండు సినిమాలు వచ్చేసాయి కాబట్టి రజినీ నటించిన కూలీ సినిమా హిందీలో మజాదూర్ పేరుతో విడుదలవుతుందని ప్రకటించారు.

- June 25, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor