పరువు హత్యల నేపథ్యం ప్రధానంగా ‘లెనిన్‌’ సినిమా?

పరువు హత్యల నేపథ్యం ప్రధానంగా ‘లెనిన్‌’ సినిమా?

హీరో అక్కినేని అఖిల్‌ కెరీర్‌లో ఓ భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా సినిమా ‘లెనిన్‌’ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అఖిల్‌ లుక్స్‌, పర్‌ఫార్మెన్స్‌ బాగుందని ప్రశంసలొచ్చాయి. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ప్రచారంలోకి వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గ్లింప్స్‌లో అఖిల్‌ రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్‌ కూడా మెప్పించాయి. అయితే ఈ సినిమా కథలో పరువు హత్యల నేపథ్యం ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. గ్రామంలోని ఓ ఆలయం చుట్టూ కథ నడుస్తుందని, బలమైన సామాజికాంశాలను కూడా చర్చించారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే. మురళీకిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

editor

Related Articles