హీరోయిన్ సమంత ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కొట్టిన లైక్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్ సంబంధిత అంశాలను కూడా తన పోస్టుల్లో ప్రస్తావిస్తుంటుంది. తాజాగా ఆమె వైవాహిక బంధాలు విఫలం కావడం గురించి ‘సక్సెస్‌వెర్స్’ అనే ఓ ఇన్‌స్టా ఖాతా షేర్ చేసిన పోస్ట్‌కు లైక్ కొట్టింది. ‘జీవిత భాగస్వామి అయిన భార్య అనారోగ్యానికి గురైతే.. పురుషులు ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇందుకు భిన్నంగా మహిళలు మాత్రం అనారోగ్యానికి గురైన భర్త పక్షాన ఉండాలని ఆయనకి సేవలు చేయాలని కోరుకుంటున్నారు’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు సమంత లైక్ కొట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలు ఆ లైక్ వెనుక కారణాలేమిటో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2021లో నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. అయితే అందుకు గల కారణాలను వారిద్దరు ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో సమంత పోస్ట్‌కు లైక్ కొట్టడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్‌లో నటిస్తోంది. నిర్మాతగా ఆమె తొలి సినిమా ‘శుభం’ వచ్చే నెల మే 9వ తేదీన రిలీజ్ కానుంది.
- April 22, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

