మన ఇండియన్ ఆడియెన్స్‌కి అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ లలో సినిమాలతో పాటుగా క్రికెట్ కూడా ఒకటి. మరి ఈ క్రికెట్లో ఐపీఎల్ సిరీస్‌కి అయితే ఎనలేని క్రేజ్ ఉంది. ఇలా ఈ ఏడాది కూడా జరుగుతున్న ఐపీఎల్లో మ్యాచ్‌లు అన్నీ మంచి రసవత్తరంగా కొనసాగుతుండగా సోషల్ మీడియాలో పలు టీంలు ఇంకా ప్లేయర్స్‌కి సంబంధించి ఎప్పటికపుడు ట్రోల్స్ లాంటివి పడుతూనే ఉంటాయి. మరి అలాగే రీజనల్గా కూడా ఆయా రాష్ట్రాలకి చెందిన సినీ ప్రముఖులు తమ అభిమాన జట్లకి మద్దతు పలుకుతారు. ఇలా లేటెస్ట్గా హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ లక్నోలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జయ కేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్‌పై మహేష్‌బాబు ఏఎంబి సినిమాస్ ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్‌బాబు ఒక్కడు సినిమాలో తన చెల్లెలికి లాలీపాప్ ఇచ్చే సన్నివేశంతో ఆర్సీబీ జట్టుపై ఫన్నీ ట్రోల్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో మంచి ఫన్‌గా మారిపోయి వైరల్ అవుతోంది.
- May 24, 2025
0
80
Less than a minute
Tags:
You can share this post!
editor


