కోలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల్లో దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ అలాగే టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ కలయికలో చేస్తున్న సాలిడ్ యాక్షన్ సినిమా ‘మదరాసి’ కూడా ఒకటి. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌లతోనే తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్‌లో కూడా సాలిడ్ బజ్‌ని సొంతం చేసుకుంది. మరి ఇలా తెరక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ తెలుస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఒక క్రేజీ క్లైమాక్స్ సీక్వెన్స్‌తో ఫైనల్ షెడ్యూల్‌ని ముగించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ షెడ్యూల్ శ్రీలంకలో ప్లాన్ చేశారట. మరి మురుగదాస్ ‘తుపాకీ’ విలన్ విద్యుత్ జమ్వల్, శివ కార్తికేయన్ నడుమ ఈ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్‌ని మురుగదాస్ తెరకెక్కించారట. మొత్తానికి మాత్రం సికందర్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పెద్దగా మురుగదాస్‌కి కనిపించడం లేదు. మరి చూడాలి మదరాసి ఎలాంటి రెస్పాన్స్‌ని అందుకుంటుంది అనేది.
- June 1, 2025
0
80
Less than a minute
Tags:
You can share this post!
editor

