అనుష్క నటించిన సినిమా పేరు ‘ఘాటి’…

అనుష్క నటించిన సినిమా పేరు  ‘ఘాటి’…

అనుష్క మెయిన్‌ రోల్‌లో నటిస్తున్న క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఘాటి’ అనే పేరు పెట్టారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇంకా మూడు రోజుల్లో అయిపోతోంది. సరిగ్గా మూడో రోజు అనుష్క పుట్టినరోజు వస్తుంది. అదేరోజు ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుండటంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు, స్పెషల్‌ గ్లింప్స్‌ని కూడా మేకర్స్‌ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల లిస్ట్‌ని కూడా ఆ రోజే వెల్లడిస్తామని మేకర్స్‌ తెలిపారు. ‘వేదం’ తర్వాత క్రిష్‌ డైరెక్షన్‌లో అనుష్క యాక్ట్ చేస్తున్న  సినిమా ఇదే అవడం విశేషం.

administrator

Related Articles