బ్రిటిష్‌ పరిపాలనా కాలం నాటి కథలో.. విజయ్‌ దేవరకొండ

బ్రిటిష్‌ పరిపాలనా కాలం నాటి కథలో.. విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ 14’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా తాలూకు సెట్‌వర్క్‌ను ఆదివారం ప్రారంభించారు. సినిమా దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ ‘పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ఇది. బ్రిటిష్‌ వారి పరిపాలనా నాటి కాలం నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇప్పటివరకు ఎవరూ చూడని, టచ్‌ చేయని కథాంశంలో ఇది సాగుతుంది. విజయ్‌ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌.

editor

Related Articles