నేను రెడీ.. తాజా షెడ్యూల్‌ ఎక్కడంటే..

నేను రెడీ.. తాజా షెడ్యూల్‌ ఎక్కడంటే..

హీరో హవీష్‌ సినిమా  నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో రాబోతోంది. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.  కుటుంబ కథా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు  ‘నేను రెడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నువ్విలా, జీనియస్‌, రామ్‌లీలా, సెవెన్‌ వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు పొందారు హవీష్‌. నిఖిల కోనేరు  నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్‌ – టాకీ పార్ట్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ మొదలైంది. వీలైనంత త్వరలో చిత్రీకరణ పూర్తిచేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ డ్రామా. అప్పట్లో ‘పెళ్లిసందడి’ సినిమాలో నటించిన కమెడియన్స్‌ అంతా కలిసి మళ్లీ తెరపై కనబడనున్నారు. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌, నిజార్‌ విజువల్స్‌ బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈ సినిమాలో సరదాలు, ఎమోషన్స్‌ అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులంతా సకుటుంబంగా థియేటర్స్‌కు వచ్చి రెండున్నర గంటలపాటు నవ్వుకుని, చివరి పదిహేను నిమిషాలు ఎమోష్‌నల్ ఫీలింగ్స్‌తో బయటకు వెళ్తారు’ అని దర్శకుడు చెప్పారు.

editor

Related Articles