సెట్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: తాప్సీ పన్ను

సెట్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: తాప్సీ పన్ను

బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ తాప్పీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నది ఈ హీరోయిన్. ఆమె నటిస్తున్న వో లడ్కీ హై కహా, గాంధారి సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. రీసెంట్‌గా తాప్సీ డైరీలోకి మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరింది. ఆ వివరాల్లోకెళ్తే.. 2018లో ఆమె నటించిన సూపర్‌హిట్‌ కోర్ట్‌ డ్రామా ‘ముల్క్‌’. ఆ సినిమా సీక్వెల్‌గా ‘ముల్క్‌ 2’ రానున్నట్టు తాప్సీ స్వయంగా తెలిపింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘నా మనసుకు దగ్గరైన పాత్ర ‘ముల్క్‌’లో చేశాను. పాకిస్తాన్‌ ఉగ్రవాదం వల్ల ఓ భారతీయ ఇస్లాం కుటుంబం ఎదుర్కొన్న అవమానాల్నీ, బాధల్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు ‘ముల్క్‌’. ఇప్పుడు ఫస్ట్‌పార్ట్‌ని మించేలా ‘ముల్క్‌ 2’ కథ రాసుకున్నారు డైరెక్టర్‌ అనుభవ్‌ సిన్హా. ఐడెండిటీ, విశ్వాసం, పౌరహక్కుల నేపథ్యంలో సాగే అద్భుతమైన కథగా ఈ సీక్వెల్‌ సాగుతుంది. సెట్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’ అని తెలిపారు తాప్సీ పన్ను.

editor

Related Articles