గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది.. ఇతను పోర్చ్‌గీసుకి చెందిన వ్యాపార వేత్త కాగా, అతనితో కొన్నాళ్లపాటు డేటింగ్‌లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి తర్వాత ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇలియానా డోలన్‌కి ముందు ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో సుదీర్ఘ కాలంగా ఎఫైర్ నడిపింది. అయితే వారిద్దరూ 2019 లో అభిప్రాయ బేధాల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం మైఖేల్ డోలన్‌తో ఇలియానా సంతోషంగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆమె రెండోసారి గర్భం దాల్చిందనే వార్తలు వినిపించాయి. గత ఏడాది అక్టోబర్‌లో సెకండ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేసింది ఇలియానా. అయితే రీసెంట్‌గా ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ఫాదర్స్ డే రోజున ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చింది అని అంటున్నారు. అధికారికంగా ఆమె తెలియజేయలేదు.
- June 18, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor

