త‌న‌తో మ‌ధ్యాహ్నం కూర్చుంటే లేచే స‌రికి సాయంత్రం..

త‌న‌తో మ‌ధ్యాహ్నం కూర్చుంటే లేచే స‌రికి సాయంత్రం..

స్టార్ హీరోయిన్ సమంత తరచూ ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. నిన్నటికి నిన్న ఓ సెటైరిక‌ల్‌ పోస్ట్‌తో ఆకట్టుకున్న సమంత, తాజాగా తన డైలీ లైఫ్‌లోని విశేషాలను షేర్ చేసింది. మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్‌తో దిగిన‌ ఫొటోను షేర్ చేస్తూ, “లంచ్‌కి మధ్యాహ్నం కూర్చుంటే, లేచేసరికీ సాయంత్రం అయిపోతుంది” అంటూ ఆ పిక్‌కి క్యాప్షన్ పెట్టింది. కీర్తి సురేష్ స‌మంత‌కి జిగిరీ దోస్త్ కాగా, వారు అప్పుడ‌ప్పుడు క‌లుస్తూ ఇలా సంద‌డి చేస్తూనే ఉన్నారు. స‌మంత‌కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నా, తరచూ కలుసుకునే సన్నిహితులు మాత్రం కొద్దిమంది మాత్రమే. అందులో కీర్తి సురేష్ ముందు వ‌రుస‌లో ఉంటారు. వీరి స్నేహం ‘మహానటి’ సినిమా నుండి మొదలైంది. సినిమాలో కీర్తి సురేష్‌ లెజెండరీ నటి సావిత్రి పాత్ర పోషించగా, సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించి అల‌రించింది.. ఈ సినిమా తర్వాత మొదలైన పరిచయం, ఇప్పటివరకు స్నేహంగా కొనసాగుతోంది. బీచ్‌ వాల్క్స్‌, పబ్ పార్టీలు, వెకేషన్లు… వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా కామన్. తాజాగా వీరిద్దరి లంచ్‌ మీట్ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. “టూ క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్” అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సమంత ఇంటర్నేషనల్ సిరీస్ రక్త్‌ బ్రహ్మాండ్ కోసం పనిచేస్తోంది. మరోవైపు త‌న నిర్మాణంలో మంచి సినిమాని తెర‌కెక్కించేందుకు ప‌లు క‌థ‌లు వింటోంది. ఇక కీర్తి సురేష్ విష‌యానికి వ‌స్తే వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

editor

Related Articles