సెంటిమెంట్‌ పండితే హిట్‌ పక్కా!

సెంటిమెంట్‌  పండితే  హిట్‌  పక్కా!

చిరంజీవి కొత్త సినిమా కోసం ఓవైపు అభిమానులంతా ఎదురుచూస్తుంటే.. అనిల్‌ రావిపూడి తనతో షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతాడా? ఆ సెట్‌లోకి తానెప్పుడు ఎంట్రీ ఇస్తానా.. అని చిరంజీవి ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు. ‘ఈ కథలోని సీన్స్‌ని అనిల్‌ వివరిస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయా. ఈ సినిమా సెట్‌లోకి ఎప్పుడు అడుగు పెడతానా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’ అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం అనిల్‌ ఈ సినిమా సెకండ్‌ హాఫ్‌ స్క్రిప్ట్‌ పనిమీద వైజాగ్‌లో ఉన్నారు. కథ రీత్యా సెకండ్‌ హాఫ్‌లో చిరంజీవి పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. చిత్తూరు యాసతో డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో మెగాస్టార్‌ కనిపిస్తారట. దానికోసం అనిల్‌ ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నయనతార ఖరారైనట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకోసం ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేశారట. అలాగే ఈ కథలో సిస్టర్‌ పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది ఆ పాత్రను నటి జ్యోతిక పోషించనున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి రజనీకాంత్‌తో నటించిన ‘చంద్రముఖి’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవితో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఇది కూడా పక్కా హిట్‌ కొడుతుందనే అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

editor

Related Articles