అనసూయ న్యూస్ రీడర్‌గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత యాంకర్‌గా మారింది. జబర్ధస్త్‌తో ఫుల్‌క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టింది. 2003లో మొదటిసారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందులో అనసూయ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక అదే ఏడాది అనసూయ చేసిన ‘క్షణం’ చిత్రం కూడా మంచి ఆదరణ పొందింది. ఇక నటిగా అనసూయ స్థాయిని పెంచిన చిత్రం రంగస్థలం కాగా, ఇందులో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచింది. అనసూయ తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలపై సరదాగా కామెంట్స్ చేసింది. యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేసిన టీవీ షోలో టాస్క్ ప్రకారం అడిగిన ప్రశ్నలన్నింటికీ నిజాయితీగా సమాధానం చెప్పాలి. లేదంటే పచ్చి మిరపకాయ తినాల్సి వస్తుంది అని యాంకర్ రవి, శ్రీముఖి తెలిపారు. దీంతో అనసూయ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసింది. ఇక రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్‌లో ఏ హీరోతో డేటింగ్ చేసేవారు అని అడగ్గా, దానికి ఏ మాత్రం ఆలోచించకుండా రామ్‌చరణ్ అని సమాధానం చెప్పింది. అలానే అడవి శేష్ గురించి కూడా కామెంట్స్ చేస్తూ.. శేష్ షూటింగ్ లొకేషన్‌లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అడవి శేషు అలా ఉండడం వల్లే క్షణం కానీ, అతని ఇతర సినిమాలు కానీ విజయం సాధిస్తున్నాయంటూ ప్రశంసలు కురిపించింది.
- May 15, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor

