అకీరా హీరో, సితార హీరోయిన్‌గా సినిమా వస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

అకీరా హీరో, సితార హీరోయిన్‌గా సినిమా వస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

ప‌వ‌న్ త‌న‌యుడు అకీరాని హీరోగా చూడాల‌ని అభిమానులు అనుకుంటున్నారు. అకీరా నందన్ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌ని కొన్నాళ్లుగా జోరుగా డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది.. అయితే అకీరా హీరో అయితే క‌చ్చితంగా హీరోయిన్ సితార మహేష్‌బాబు కూతురే ఉండాల‌ట‌..! ప‌వ‌న్ తన వారసుడు అకీరా నందన్‌ను అతి త్వరలో లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అకీరా నందన్‌ను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ లాంచ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మహేష్‌బాబు, రామ్ చరణ్ తేజ్‌లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అశ్వినీదత్ కాగా, ఇప్పుడు అకీరా నందన్ బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారని తెలుస్తోంది. అఖీరానందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే హీరోయిన్ మాత్రం మహేష్‌బాబు కూతురు సితార అయి ఉండాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో మొదటి నుండి పవన్ కళ్యాణ్ – మహేష్‌బాబు మ‌ధ్య మంచి స్నేహ బంధం ఉంది. మ‌రోవైపు సితార కూడా సినీ ఇండ‌స్ట్రీలో త‌న స‌త్తా చూపించాల‌ని ఎంత‌గానో అనుకుంటోంది. మరి అకీరా-సితార జంట‌గా ఎవ‌రైన సినిమా తీస్తే మాత్రం అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం ఖాయం. ఇది జ‌రుగుతుందా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. కాగా, అకీరా నందన్ మొదటి సినిమాకు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వ‌హించ‌నున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్, ఇప్పుడు అకీరా నందన్‌ను లాంచ్ చేయడానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

editor

Related Articles