‘నాకు కిస్ ఇవ్వాలని ఉంది’ – ఎఐపై కమల్ హాసన్ కామెంట్స్

‘నాకు కిస్ ఇవ్వాలని ఉంది’ – ఎఐపై కమల్ హాసన్ కామెంట్స్

కృత్రిమ మేధస్సు  రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై నటుడు, లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల USAలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ ప్రత్యేక కోర్సును అభ్యసించిన తర్వాత, ఆయన AI భవిష్యత్తు, మానవ సంబంధాలపై దాని ప్రభావం గురించి తన అభిప్రాయాలను షేర్ చేశారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. టెక్నాలజీలో మ‌నం ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నా.. మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ కోర్సు తర్వాత తన అవగాహన మరింత పెరిగిందని, అయితే మానవ భావోద్వేగాలు, అనుబంధాలు చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. నాకు నిజమైన స్త్రీని ముద్దు పెట్టుకోవాలని ఉంది కానీ, AI సృష్టించిన అమ్మాయిని ముద్దుపెట్టుకోవాల‌ని లేదని క‌మ‌ల్ చ‌మ‌త్క‌రించారు.

editor

Related Articles