అమీర్‌ఖాన్ త్వరలో ‘సీతారే జమీన్ పర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్, తాను చాలా ఏళ్లుగా కలలు కంటున్న ‘మహాభారతం’ ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతం సినిమా అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతంలో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో మలచాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఈ సినిమా నా కెరీర్‌లో చివరి సినిమా కూడా కావొచ్చు అని ఆయన తెలియజేశారు. ఇలాంటి గొప్ప కథ తర్వాత నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్ధం కాని పరిస్థితి. నాకు పనిచేస్తూ చనిపోవాలని ఉంది కాని, బహుశా ఇదే చివరి సినిమా అవుతుందని అమీర్ అన్నారు. అయితే రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినా… ఆయన ఆ వైపు అడుగులు వేయలేదు. అయితే జక్కన్న కన్నా ముందు అమీర్‌ఖాన్ రంగంలో దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. అయితే స్క్రిప్ట్ రాయడానికి టైం పడుతుందని.. పైగా అన్ని క్యారెక్టర్లను ఒకే సినిమాలో చూపించలేం కాబట్టి… సీరిస్‌గా దీన్ని తెరపైకి తీసుకొస్తానంటూ పేర్కొన్నారు.
- June 1, 2025
0
132
Less than a minute
Tags:
You can share this post!
editor

