అత‌డి పెదవులు నా పెదవులకు తాకగానే వాంతులు చేసుకున్నా: రవీనా టాండన్

అత‌డి పెదవులు నా పెదవులకు తాకగానే వాంతులు చేసుకున్నా: రవీనా టాండన్

90వ దశకంలో బాలీవుడ్‌ను రూల్ చేసిన‌ న‌టి రవీనా టాండన్‌. 1991లో ‘పత్తర్ కే ఫూల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఆ త‌ర్వాత తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో న‌టించి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ న‌టి త‌న కెరీర్ ప్రారంభంలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న గురించి తాజాగా పంచుకుంది. త‌న‌ సహనటుడితో అనుకోకుండా జరిగిన లిప్-టచ్ వల్ల తాను వాంతులు చేసుకున్నానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కెరీర్ ప్రారంభం నుంచీ ముద్దు సన్నివేశాలకు, రొమాంటిక్ సీన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకుంది ర‌వీనా. అయితే, ఒక సినిమా షూటింగ్‌లో అనుకోని సంఘటన జరిగిందంటూ రవీనా వివరించారు. “నాకు బాగా గుర్తుంది. ఒక సినిమాలో హీరో నన్ను రఫ్‌గా హ్యాండిల్ చేయాల్సిన సీన్ అది. ఆ సన్నివేశం షూట్ చేస్తుండగా, అనుకోకుండా అతడి పెదవులు నా పెదాలను తాకాయి. అక్కడ ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది కేవలం పొరపాటున జరిగింది” అని ఆమె తెలిపారు. ఈ సంఘటన తనను తీవ్ర అసౌకర్యానికి గురి చేసిందని, “నాకు వికారంగా అనిపించింది. లైట్ తీసుకోలేకపోయాను. వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్లి వాంతులు చేసుకున్నాను.

editor

Related Articles