హీరో పవన్‌కళ్యాణ్ కోపంలో అర్థం ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి విషయంలోనూ న్యాయం ఉంది. నేను పూర్తిగా ఆయనతో ఏకీభవిస్తున్నా. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మేం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాం. కానీ సినిమారంగంలో ప్రముఖులమని చెప్పుకునే చాలామంది.. పవన్ మాకు తెలుసు అనుకున్నారే గానీ.. ఆయన్ను కలవాలనే ఆలోచన మాత్రం చేయలేదు. ఇది పూర్తిగా తప్పు. ‘జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేద్దాం అనుకుంటున్నాం.. మీటింగులకి రండి..’ అని నన్ను కూడా పిలిచారు. ఈ విషయంపై మూడుసార్లు ఛాంబర్‌లో మీటింగులు జరిగాయి. కానీ నేను ఏ మీటింగుకీ వెళ్లలేదు. వారి నిర్ణయం సమంజసంగా అనిపించలేదు కాబట్టే మీటింగులకు దూరంగా ఉన్నా. థియేటర్లకు సమస్యలున్నాయి. వాటిని ప్రభుత్వంతో కలిసి చర్చించి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతేకానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలా?. అయినా పవన్‌కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంలో థియేటర్లు మూసేస్తామని అనడం నిజంగా దుస్సాహసమే.’ అని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

- May 26, 2025
0
58
Less than a minute
Tags:
You can share this post!
editor