మ‌ళ్లీ క‌లిసిన బ‌న్నీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స‌తీస‌మేతంగా ఇంటికి వెళ్లి మార్క్ ఆరోగ్యంపై ఆరా

మ‌ళ్లీ క‌లిసిన బ‌న్నీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స‌తీస‌మేతంగా ఇంటికి వెళ్లి మార్క్ ఆరోగ్యంపై ఆరా

కొన్నాళ్లుగా ఇండ‌స్ట్రీలో జరుగుతున్న చ‌ర్చ‌నీయాంశాల‌లో మెగా వ‌ర్సెస్ అల్లు ఫ్యామిలీల వార్ ఒక‌టి. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ నంద్యాల వెళ్లి మరీ ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వైపు అంటే .. ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘోరంగా ఓడిపోవ‌డంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ఆ త‌ర్వాత నాగ‌బాబు ప‌రోక్షంగా ట్వీట్ చేయ‌డం, మెగా హీరోలు కూడా బ‌న్నీ విష‌యాల‌లో పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డంతో అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీకి దూర‌మ‌య్యాడ‌నే ప్ర‌చారం అయితే జోరుగా న‌డిచింది. .పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ, మెగా హీరోలెవ్వరూ స్పందించ‌క‌పోవ‌డం, అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ హీరోలు ఏ మాత్రం స్పందించ‌క‌పోవ‌డం, రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సందర్భంగా బ‌న్నీ ఒక్క ట్వీట్ కూడా వేయ‌క‌పోవ‌డం వంటివి రెండు ఫ్యామిలీల మ‌ధ్య పెరిగిన దూరానికి సంకేతాలుగా చెప్పుకొచ్చారు. అయితే నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇంటికి వెళ్లి మరీ అతణ్ణి, కుమారుడిని పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం ప‌వన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విష‌యం విదిత‌మే. ఈ నేపథ్యంలోనే బన్నీ ఆయన భార్య స్నేహారెడ్డి పవన్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులతో దాదాపు గంటసేపు మాట్లాడినట్లు సమాచారం. ఇన్నాళ్లు బ‌న్నీ ఫ్యాన్స్ వ‌ర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ జ‌రిగిన గొడవ ఈ క‌లుయిక‌తో కొలిక్కి వ‌స్తుందా లేదా అనేది చూడాలి.

editor

Related Articles