అర్ధనగ్నంగా చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు…

అర్ధనగ్నంగా చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు…

కళ్యాణం కమనీయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన చెన్నై (తమిళ) యాక్టర్‌ ప్రియా భవానీశంకర్‌. ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రియా భవానీశంకర్‌ బిజీబిజీ అయిపోయింది. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘బ్లాక్‌’ ఈ నెల 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ప్రియా భవానీశంకర్‌. ‘కెరీర్‌ పరంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్కిన్‌షోకు మాత్రం ఓటు వేయను. నా శరీరం వస్తువు కాదు. ఒక వస్తువు (టాయ్‌)గా నా శరీరాన్ని చూపించాలనుకోవడంలేదు. సినిమాల్లో రాణించాలంటే అందంగా కనిపిస్తే చాలు. బట్టలూడదీసుకోవాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం నచ్చకే టాలీవుడ్‌ నుండి వచ్చిన ఆఫర్లు వచ్చినట్లే వచ్చి అంతలోనే క్యాన్సిల్‌ అవుతున్నాయి. అయినా సరే.. ఆత్మాభిమానాన్ని చంపుకొని స్కిన్‌షో చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా మాత్రమే కనిపించాలని రూలేమీ లేదు, చిన్న పాత్రలైనా చేస్తాను. నెగెటివ్‌ కేరక్టర్లు చేయడానికి కూడా రెడీ. స్కిన్‌ షో మాత్రం చేయను, అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది ప్రియా భవానీశంకర్‌.

editor

Related Articles