అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య ఎంత రిజర్వ్‌డ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పెద్దగా వివాదాలలో తలదూర్చడు. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వలన విడిపోయి హాట్ టాపిక్‌గా మారాడు. అయితే గత ఏడాది చైతూ.. టాలీవుడ్ హీరోయిన్ శోభితని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహాన్ని అక్కినేని ఫ్యామిలీ అట్టహాసంగా నిర్వహించింది. ప్రస్తుతం శోభిత, చైతూ తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికీ ఇచ్చాడో ఓ షో ద్వారా తెలియజేస్తూ అందరికి షాక్ ఇచ్చారు. ఇటీవల రానా షోకు వెళ్లిన నాగ చైతన్య… తన తొలి ముద్దు ఎవరికి ఇచ్చిన విషయాన్ని రివీల్ చేశాడు. తన తొలి ముద్దు అనుభవం గురించి సిగ్గుపడుతూ.. స్టన్నింగ్ సమాధానం చెప్పాడు. మొదటి ముద్దు ఎప్పుడు.? ఎవరికి పెట్టావో గుర్తుందా..? అని రానా అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య సమాధానం ఇస్తూ.. తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య రివీల్ చేశాడు. ఆ ముద్దు తన జీవితమంతా పని చేసిందని చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక గతంలో ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా తనకు మర్చిపోలేని జ్ఞాపకం అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
- May 27, 2025
0
170
Less than a minute
Tags:
You can share this post!
editor

