ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ గతేడాది తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముగింపు పలికామని చెప్పుకొచ్చారు. అయితే తాను విడాకులు ప్రకటించిన అనంతరం తనపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయని రెహమాన్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ విమర్శలు తన కుటుంబసభ్యులే చేశారని అనుకుంటానని తెలిపారు. సెలబ్రిటీల జీవితాల గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు. వారి జీవితంలో ఏం జరుగుతుందో గమనిస్తారు, విమర్శిస్తారు. విమర్శల నుండి ఎవరూ తప్పించుకోలేరు. నేనూ అంతే. నా గురించి తప్పుగా మాట్లాడేవారిని కూడా నా కుటుంబ సభ్యుల్లాగే భావిస్తాను. నేను ఒకరి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే.. రేపు నా కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడవచ్చు. మన ఇండియన్ కల్చర్ ప్రకారం.. ఎవరూ అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ సోదరి, భార్య, తల్లి ఉంటారు. ఎవరైనా బాధాకరమైన మాటలు అన్నప్పుడు, నేను, ‘దేవుడా, వారిని క్షమించి, సన్మార్గంలో నడిపించు’ అని వేడుకుంటానని రెహమాన్ చెప్పుకొచ్చాడు.
- April 24, 2025
0
66
Less than a minute
Tags:
You can share this post!
editor

